జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ ఈడీ ఎదుట హాజరయ్యారు. ఎస్ బ్యాంక్ ప్రమోటర్ రానా కపూర్ పై నమోదైన మనీ లాండరింగ్ కేసుతో సంబంధాలున్నాయంటూ నరేష్ గోయల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనను విచారణకు హాజరవ్వాలంటూ మార్చి 18న ఈడీ సమన్లు జారీ చేసింది. జెట్ ఎయిర్ వేస్ సంస్థ ఎస్ బ్యాంక్ కు దాదాపు రూ.550 కోట్లు బాకీ ఉంది.
ఎస్ బ్యాంకు వ్యవహారంపై ఈడీ ఎదుటకు నరేష్ గోయల్ - ఎస్‌బ్యాంక్ మనీ లాండరింగ్ కేసు
ఎస్‌బ్యాంక్ మనీ లాండరింగ్ కేసులో సంబంధాలున్నాయంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ ఈడీ ఎదుట హాజరయ్యారు. విచారణకు హజరవ్వాలంటూ ఈ నెల 18న ఈడీ సమన్లు జారీ చేసింది.
ఈడీ ఎదుట హజరైన నరేష్ గోయల్
ఆర్థిక ఇబ్బందులతో గత ఏడాది ఏప్రిల్ లో జెట్ ఎయిర్ వేస్ సంస్థ తన కార్యకలాపాలను నిలిపివేయగా... అదే ఏడాది గోయల్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. సుమారు 44 కంపెనీలు ఎస్ బ్యాంక్ లో 34 వేల కోట్ల మేర అక్రమ రుణాలు తీసుకున్నాయి. ఎస్ బ్యాంక్ ప్రమోటర్ రానా కపూర్ ను ఇప్పటికే ఈడీ అరెస్టు చేసింది.
ఇదీ చూడండి:-కరోనా వ్యాప్తిని అరికట్టే ఆయుధాలు ఇవే..