Emergency Data Loan: మొబైల్లో డెయిలీ డేటా లిమిట్ అయిపోయాక.. ఇంటర్నెట్ వేగం తగ్గిపోతుంది. ఒక్కోసారి అత్యవసర సమయంలో ఉన్నప్పుడు ఇలా సడన్‌గా డేటా అయిపోతుంటుంది. అబ్బా.. ఇంకొంచెం డేటా ఉంటే బావుండు అని అనుకుంటాం.
ఇలాంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే.. పలు టెలికాం సంస్థలు 'యూజ్ నౌ పే లేటర్' అనే నూతన విధానాన్ని తీసుకొచ్చాయి. ఈ ఫీచర్ వల్ల అవసరమైనప్పుడు డేటాలోన్ తీసుకుని.. తర్వాత చెల్లించుకోవచ్చు. ఈ వెసలుబాటును జియో, ఎయిర్టెల్, ఐడియా టెలికాం సంస్థలు వినియోగదారుల కోసం అందుబాటులోకి తెచ్చాయి. వాటిపై ఓ లుక్కేద్దాం..
జియోలో ఎమర్జెన్సీ డేటా లోన్..
emergency data loan jio: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో గతేడాదే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. 'ఎమర్జెన్సీ డేటా లోన్' పేరిట వినియోగదారులు ముందస్తు చెల్లింపు లేకుండా రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.
జియో వినియోగదారులు ఎంత డేటాను లోన్‌గా తీసుకోవచ్చు?
జియో వినియోగదారులు రూ. 25కి 2జీబీ డేటాను లోన్‌గా పొందవచ్చు. ప్రీపెయిడ్ వినియోగదారులు అందరూ ఈ ఫీచర్‌ను వినియోగించుకోవచ్చు.
డేటాలోన్ను తిరిగి ఎలా చెల్లించాలి?
డేటాలోన్ను తిరిగి చెల్లించడానికి మై జియో యాప్‌ను ఓపెన్ చేసి ప్రొసీడ్ బటన్ క్లిక్ చేసి.. 'ఎమర్జెన్సీ డేటా ఓచర్స్'లోకి వెళ్లాలి. స్కీన్‌పై పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి నగదు చెల్లించాలి.
డేటా లోన్‌ను తిరిగి చెల్లించకపోతే..?
డేటాలోన్ను తిరిగి చెల్లించకపోతే.. ఇలాంటి ఆఫర్ తిరిగి వినియోగించకుండా నిషేధిస్తుంది సంస్థ. చెల్లింపులు పూర్తయ్యాకే డేటా లోన్ ఆఫర్లకు అనుమతినిస్తుంది.
ఎయిర్టెల్ డేటాలోన్..