తెలంగాణ

telangana

ETV Bharat / business

ప్రభుత్వ వాణిజ్య కార్యకలాపాల్లో ప్రైవేటు బ్యాంకులు - పింఛన్​ చెల్లింపులు

ప్రభుత్వ వాణిజ్య కార్యకలాపాల్లో.. ప్రైవేటు బ్యాంకులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది కేంద్రం. వినియోగదారులకు మరింత మెరుగైన సదుపాయాలు అందించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది.

Government Business to Private Banks
ప్రభుత్వ వాణిజ్య కార్యకలాపాల్లో ప్రైవేటు బ్యాంకులకు అనుమతి

By

Published : Feb 24, 2021, 5:34 PM IST

Updated : Feb 24, 2021, 6:09 PM IST

ప్రభుత్వ వాణిజ్య కార్యకలాపాల్లో ప్రైవేటు బ్యాంకులకు అనుమతి ఇస్తూ కేంద్రం ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు.. గతంలో విధించిన ఆంక్షలను ఎత్తివేసింది.

ఇప్పటి వరకు ప్రభుత్వ రంగానికి చెందిన పన్నులు, పింఛన్ల చెల్లింపు, చిన్నతరహా పొదుపు వంటి బ్యాంకింగ్‌ లావాదేవీలు ప్రభుత్వ రంగ బ్యాంకులే నిర్వహించేవి. కొన్ని ప్రైవేటు బ్యాంకులకు మాత్రమే అనుమతి ఉండేది. తాజాగా ఆ నిబంధనను తొలగించారు.

మెరుగైన సేవల కోసం..

ఫలితంగా.. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందుతాయని స్పష్టం చేసింది కేంద్రం. ఇంకా పోటీతత్వాన్ని పెంచేందుకూ ఈ నిర్ణయం దోహదపడుతుందని పేర్కొంది.

అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ప్రైవేటు బ్యాంకులు ముందంజలో ఉన్నాయని కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలోనే.. ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో ప్రైవేటు బ్యాంకులకు సమాన అవకాశాలను కల్పించనున్నట్లు పేర్కొంది. ఈ విషయంతో ఆర్​బీఐతో ఎలాంటి చిక్కులు ఉండవని.. తన నిర్ణయాన్ని కేంద్ర బ్యాంకుకు తెలిపినట్లు స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: అతిపెద్ద క్రికెట్​ స్టేడియానికి రాష్ట్రపతి శ్రీకారం

Last Updated : Feb 24, 2021, 6:09 PM IST

ABOUT THE AUTHOR

...view details