తెలంగాణ

telangana

ETV Bharat / business

మస్క్ మేజిక్.. ఒక్కరోజే రూ.223 కోట్లు పెరిగిన సంపద - ఎలన్​ మస్క్​ షేర్లు

Elon Musk Wealth: ప్రపంచ కుబేరుడు ఎలన్​ మస్క్​.. కొత్త సంవత్సరం తొలి ట్రేడింగ్​ సెషన్​లోనే సుమారు 223 కోట్లను తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో ఆయన సంపద మరింత వృద్ధి చెంది 304 బిలియన్​ డాలర్లకు చేరుకుంది.

Elon Musk Wealth
భారీగా పెరిగిన మస్క్​ సంపద

By

Published : Jan 4, 2022, 6:34 PM IST

Elon Musk Wealth: కొత్త ఏడాదిలో అపర కుబేరుడు ఎలన్​ మస్క్​ లక్కీ ఛాన్స్​ కొట్టారు. కేవలం ఒక్క రోజులోనే ఆయన సంపద రూ.223 కోట్లకు పైగా పెరిగింది.

మస్క్​కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్​ కార్ల కంపెనీ తయారీ సంస్థ అయిన టెస్లా.. నాలుగో త్రైమాసికంలో అత్యధిక సంఖ్యలో కార్లను డెలివరీ ఇచ్చినట్లు ప్రకటించింది. దీంతో టెస్లా స్టాక్స్​.. సోమవారం మార్కెట్​ సెషన్​లో సుమారు 13.5 శాతం పెరిగాయి. ఒక్కో షేర్​ విలువ 1,199.78 డాలర్లకు పెరిగింది. దీంతో మార్కెట్​ విలువ 144 బిలియన్​ డాలర్లు ఎగబాకింది.

నాలుగో త్రైమాసికానికి గానూ టెస్లా 3 లక్షల 8 వేల ఎలక్ట్రిక్​ వాహనాలను వినియోగదారులకు డెలివరీ చేసింది. ఇది మార్కెట్​ విశ్లేషకులు ఊహించిన దాని కంటే చాలా ఎక్కువ. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం డెలివరీలు 87% పెరిగాయి. కరోనా కారణంగా మార్కెట్​లో చిప్​ల కొరత, ఇతర లాజిస్టికల్ సమస్యలు ఉన్నా కానీ సంస్థ ఎక్కువ డెలివరీలు ఇవ్వడం, కొత్త ఏడాదిలో కూడా ఎలక్ట్రిక్​ వాహనాలకు మంచి డిమాండ్ ఉందని అంతర్జాతీయ మీడియా పేర్కొన్న కారణంగా మదుపరులు టెస్లా షేర్లను భారీగా కొనుగోలు చేశారు. దీంతో టెస్లా లాభాల నుంచి మస్క్​కు 33 బిలియన్​ డాలర్లు (సుమారు రూ.223కోట్లు) వచ్చి చేరాయి. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రస్తుతం మస్క్​ నికర ఆస్తి విలువ 304 బిలియన్​ డాలర్లుగా ఉంది.

కార్లను అద్దెకు ఇచ్చే కంపెనీ అయిన హెర్ట్జ్.. భారీ ఆర్డర్​ను టెస్లాకు ఇచ్చింది. మూడు మోడళ్లలో లక్ష కార్లను ఆర్డ్​ ఇచ్చింది. దీంతో గతేడాది అక్టోబర్​లో టెస్లా ట్రిలియన్​ డాలర్ల మార్కెట్​ వ్యాల్యూను సొంతం చేసుకుంది. మరో వైపు మస్క్​కు చెందిన స్పేస్​ఎక్స్​ షేర్లు​ కూడా జీవనకాల గరిష్ఠాల్లో ఉన్నాయి.

ఇదీ చూడండి:3 ట్రిలియన్​ డాలర్ల తొలి కంపెనీగా 'యాపిల్​' ఘనత!

ABOUT THE AUTHOR

...view details