తెలంగాణ

telangana

ETV Bharat / business

మస్క్ సంపద ఒక్కరోజే రూ.1.8 లక్షల కోట్లు వృద్ధి - జెఫ్​ బెజోస్ సంపద విలువ

టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్ సంపద మరోసారి రికార్డు స్థాయిలో పెరిగింది. టెస్లా షేర్లు మంగళవారం ఏకంగా 20 శాతం పుంజుకున్న నేపథ్యంలో మస్క్ సంపద 25 బిలియన్​ డాలర్లు (భారత కరెన్సీలో రూ.1.8 లక్షల కోట్ల పైమాటే) ఎగిసింది.

Elon musk wealth rise 25 billion USD
భారీగా పెరిగిన ఎలాన్​ మస్క్ సంపద

By

Published : Mar 10, 2021, 2:00 PM IST

దిగ్గజ విద్యుత్​ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్​ సంపద ఒక్క రోజులో ఏకంగా 25 బిలియన్ డాలర్లు పెరిగింది. టెస్లా షేర్లు మంగళవారం దాదాపు 20 శాతం పుంజుకోవడం ఇందుకు కారణం. ఏడాది కాలంలో టెస్లా షేర్లు ఈ స్థాయిలో పుంజుకోవడం కూడా ఇదే ప్రథమం. చైనాలో విక్రయాలు భారీగా పెరిగినట్లు గణాంకాలు వెలువడటం టెస్లా షేర్లలో ఉత్సాహం నింపాయి.

ఒక్క రోజులో దాదాపు రికవరీ..

ఇటీవల టెస్లా షేర్లు వరుసగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్న కారణంగా మస్క్ సంపద దాదాపు 27 బిలియన్​ డాలర్లు ఆవిరైంది. మంగళవారం ఒక్క రోజే ఆ నష్టమంతా దాదాపు రికవరీ కావడం విశేషం. దీనితో అమెజాన్ అధినేత జెఫ్​ బెజోస్, ఎలాన్​ మస్క్​ సంపదల మధ్య ఉన్న అంతరం కూడా భారీగా తగ్గింది.

ఇటీవల మస్క్ సంపద భారీగా తగ్గటం వల్ల జెఫ్​ బెజోస్ ప్రపంచంలో అత్యంత ధనవంతుడి కిరీటాన్ని దక్కించుకోవడం గమనార్హం.

బ్లూమ్​బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకారం.. ఎలాన్​ మస్క్ మొత్తం సంపద ప్రస్తుతం 174 బిలియన్ డాలర్లకు చేరినట్లు తెలిసింది. అమెజాన్ షేర్లు కూడా మంగళవారం భారీగా పుంజుకున్న నేపథ్యంలో జెఫ్​ బెజోస్ సంపద 6 బిలియన్​ డాలర్లు ఎగిసి.. మొత్తం సంపద 180 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు వెల్లడైంది.

ఇదీ చదవండి:ఇలా చేస్తే మీ ఆన్​లైన్ లావాదేవీలు సురక్షితం!

ABOUT THE AUTHOR

...view details