ప్రముఖ విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మరోసారి ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా అవతరించారు. టెస్లా షేర్లు సోమవారం 2 శాతానికిపైగా పెరిగిన నేపథ్యంలో మస్క్ సంపద.. 182 బిలియన్ డాలర్లకు చేరింది. దీనితో ప్రపంచ కుబేరుల్లో అగ్ర కిరీటాన్ని దక్కించుకున్నారు మస్క్.
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 181 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో రెండో అత్యంత సంపన్నుడిగా నిలిచారు.
నిజానికి ఈ ఏడాది జనవరిలో మస్క్ మొత్తం సంపద 210 బిలియన్ డాలర్లుగా ఉండేది. అయితే ఆయన చెసిన కొన్ని ట్వీట్లు సహా పలు ఇతర కారణాల షేర్ల విలువ క్షీణించి, సంపద భారీగా తగ్గింది. దీనితో జెఫ్ బెజోస్ ప్రపంచంలో అత్యంత ధనవంతుడి స్థానాన్ని దక్కించుకున్నారు.