ప్రముఖ విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌ను అధిగమించి మస్క్ ఈ స్థానాన్ని సంపాదించారు.
ప్రపంచ కుబేరుడిగా మళ్లీ ఎలాన్ మస్క్ - జెఫ్ బెజోస్ సంపద
ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా ఎలాన్ మస్క్.. మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌ను అధిగమించి ఆయన ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
ప్రపంచ కుబేరుడిగా మళ్లీ ఎలాన్ మస్క్
టెస్లా షేర్ల విలువ పెరగడంతో మస్క్ ఈ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. బ్లూమ్‌బర్గ్ తాజా నివేదిక ప్రకారం ఎలాన్ మస్క్ సంపద 199.9 బిలియన్ డాలర్లు. జెఫ్‌బెజోస్ సంపద 194 బిలియన్ డాలర్లు.