ఎలి లిల్లీ అండ్ కంపెనీ ఇండియా అభివృద్ధి చేసిన యాంటీ బాడీ డ్రగ్స్ కాంబినేషన్‌కు కరోనా చికిత్సలో అత్యసర వినియోగానికి షరతులతో కూడిన అనుమతులు లభించాయి. ఈ మేరకు ఎలి లిల్లీ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.
తాము అభివృద్ధి చేసిన ఔషధాన్ని స్వల్ప లక్షణాల నుంచి తీవ్రత తక్కువగా ఉన్న కేసుల్లో.. చికిత్సకు ఉపయోగించవచ్చని ఎలి లిల్లీ వెల్లడించింది. బామ్లానివిమాబ్ 700ఎంజీ, ఎటిసీవిమాబ్ 1400 ఎంజీ మందులను కలిపి కాక్‌టైల్‌గా రోగులకు ఇస్తే మంచి ఫలితాలు వస్తున్నట్లు.. ఎలి లిల్లీ వివరించింది. ఈ కాక్‌టైల్‌కు అమెరికాతో పాటు.. ఐరోపా దేశాల్లో అత్యసర వినియోగానికి అనుమతి ఉంది.