తెలంగాణ

telangana

ETV Bharat / business

2-3 ఏళ్లలో తక్కువ ధరకే విద్యుత్​ కారు - Electric car price

భారత వాహన పరిశ్రమ రానున్న కాలంలో అభివృద్ధి చెందుతున్న దృక్పథంతో పలు కీలక అంశాలపై దృష్టిసారిస్తోంది హ్యుందాయ్​. ఈ మేరకు తక్కువ ధరలోనే విద్యుత్​ కారును అందించే ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నట్టు ఆ సంస్థ ఎండీ తెలిపారు.

Electric cars will be available soon with low cost in India: Hyundai
2-3 ఏళ్లలో తక్కువ ధరకే విద్యుత్తు కారు

By

Published : Feb 18, 2021, 7:44 AM IST

భారత వాహన పరిశ్రమ భవిష్యత్తులో రాణిస్తుందన్న అంచనాల మధ్య దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్​ పలు అంశాలపై దృష్టి సారిస్తోంది. విద్యుత్​ కార్లు, అనుసంధాన ఫీచర్లు, స్వయం చాలిత సాంకేతికతలపై దృష్టి కేంద్రీకరించినట్టు హ్యుందాయ్​ మోటార్​ ఇండియా ఎండీ, సీఈఓ ఎస్.ఎస్.కిమ్​ పేర్కొన్నారు.

తక్కువ ధర విద్యుత్​ కారును అభివృద్ధి చేసే ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం లేదని.. రెండు మూడేళ్లలో దేశంలోకి ఆ వాహనాన్ని తీసుకువరావాలన్న ప్రణాళికలో ఉన్నట్టు వివరించారు కిమ్​. భారత మార్కెట్లోకి వచ్చి పాతికేళ్లు పూర్తైన ఈ కంపెనీ.. ఇప్పటివరకు 400 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టింది. తాజాగా అన్ని విభాగాలకు డిజిటలైజేషన్​ను విస్తరించాలని భావిస్తోంది. కరోనా ముందు స్థాయిలకు విక్రయాలు చేరాలంటే 2-3 ఏళ్ల సమయం పడుతుందని తెలిపారు ఎండీ​.

ఇదీ చదవండి:ట్విట్టర్​లో ఇక వాయిస్​ మెసేజ్​లూ చేసుకోవచ్చు!

ABOUT THE AUTHOR

...view details