తెలంగాణ

telangana

ETV Bharat / business

2025 నాటికి బైక్స్​లో 10 శాతం ఈవీలే! - ఇక్రా లేటెస్​ న్యూస్

తక్కువ నిర్వహణ వ్యయం, ప్రత్యేక రాయితీల వల్ల 2025 నాటికి విద్యుత్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ భారీగా పెరగొచ్చని ఓ అధ్యయనంలో తేలింది. ఆ సమయంలో టూ వీలర్స్​లో 8-10 శాతం విద్యుత్ వాహనాలే ఉంటాయని వెల్లడైంది.

విద్యుత్ ద్విచక్రవానాల విక్రయాలపై నివేదిక

By

Published : May 26, 2021, 7:24 PM IST

దేశంలో 2025 నాటికి విద్యుత్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాల వాటా వరుసగా 8-10 శాతం, 30 శాతంగా ఉంటుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. తక్కువ నిర్వహణ వ్యయం, ప్రత్యేక రాయితీలు ఇందుకు దోహదం చేయొచ్చని వివరించింది. మధ్యస్థ కాలానికి కార్లు, ట్రక్కుల విషయంలో మాత్రం వృద్ధి తక్కువగానే ఉండొచ్చని వివరించింది.

ప్రపంచవ్యాప్తంగా 2020లో అమ్ముడైన కార్లలో విద్యుత్ కార్ల వాటా 4.4 శాతంగా ఉన్నట్లు ఇక్రా పేర్కొంది. ఈ ఏడాది ఆ మొత్తం 5 శాతానికి పెరగొచ్చని వివరించింది.

కొవిడ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది ఆటోమొబైల్ విక్రయాలు క్షీణించాయని నివేదిక పేర్కొంది. అయినప్పటికీ అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే విద్యుత్​ వాహనాల విక్రయాలు దాదాపు 40 శాతం పెరినట్లు తెలిపింది.

ఇదీ చదవండి:జూన్​లో బ్యాంక్​లకు అదనపు సెలవులు ఇవే..

ABOUT THE AUTHOR

...view details