తెలంగాణ

telangana

By

Published : Nov 8, 2020, 5:39 PM IST

ETV Bharat / business

బిహార్ ఫలితాలు, ఆర్థిక గణాంకాలే కీలకం!

స్టాక్ మార్కెట్లు ఈ వారం బిహార్ ఎన్నికల ఫలితాలు, కీలక ఆర్థిక గణాంకాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నాయి. అమెరికా ఎన్నికల్లో బైడెన్​ గెలుపు అంశం కూడా మార్కెట్లను ప్రధానంగా ప్రభావితం చేసే వీలుంది.

Bihar Election results impact on Stock markets
స్టాక్ మార్కెట్లపై బిహార్ ఎన్నికల ప్రభావం

బిహార్ ఎన్నికల ఫలితాలు, కీలక ఆర్థిక గణాంకాలు, అమెరికా అధ్యక్షుడిగా బైడెన్​ గెలుపుతో చోటుచేసుకోనున్న అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ల గమనాన్ని నిర్దేశించనున్నాయి.

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 10న వెలువడనున్నాయి. ఎగ్జిట్ పోల్స్​ ప్రకారం హంగ్ ఏర్పడేందుకు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే మార్కెట్ల సెంటిమెంట్​పై ప్రతికూల ప్రభావం పడొచ్చని.. మోతీలాల్​ ఓస్వాల్​ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ విభాగాధిపతి హేమంగ్ జైన్ అన్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ ఘన విజయం సాధించారు. ముందునుంచే బైడెన్​ గెలుపుపై అంచనాలు పెట్టుకున్న మార్కెట్లకు ఇది శుభవార్తే అని చెప్పాలి. బైడెన్​ గెలుపు భారత ఐటీ కంపెనీలకు కలిసొచ్చే అవకాశమున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు ఈ వారం పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణం గణాంకాలు విడుదల కానున్నాయి. మదుపరులు ఆచితూచి స్పందించే అవకాశముంది. కార్పొరేట్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసిక ఫలితాల ప్రభావం కూడా మార్కెట్లపై పడనుంది.

రూపాయి, ముడి చమురు ధరలు కూడా మార్కెట్లను ప్రభావితం చేసే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.

ఇదీ చూడండి:'రాయల్​ ఎన్​ఫీల్డ్​ నుంచి 28 కొత్త మోడల్స్​'

ABOUT THE AUTHOR

...view details