ప్రముఖ క్రిప్టోకరెన్సీగా పేరొందిన బిట్‌కాయిన్ ఇకపై మధ్య అమెరికాలోని ఎల్ సాల్వడార్లో అధికారికంగా చెల్లుబాటు కానుంది. ఇందుకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందినట్లు ఆ దేశాధ్యక్షుడు నయిబ్ బుకేలే ప్రకటించారు. ఈ నిర్ణయంతో ప్రపంచంలోనే బిట్‌కాయిన్‌కు తొలిసారి చట్టబద్ధత కల్పించిన దేశంగా ఎల్‌సాల్వడార్ నిలిచింది.
బిట్‌కాయిన్‌ను చట్టబద్ధం చేసిన తొలి దేశం ఇదే... - is bitcoin legal in el salvador
సెంట్రల్ అమెరికాలోని ఎల్ సాల్వడార్ బిట్‌కాయిన్‌ను చట్టబద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన బిల్లును అక్కడి చట్టసభ ఆమోదం తెలిపినట్లు ఆ దేశ అధ్యక్షుడు ప్రకటించారు.
బిట్‌కాయిన్
బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత కల్పించే బిల్లు ఎల్ సాల్వడార్ కాంగ్రెస్ సూపర్ మెజారిటీతో ఆమోదం పొందింది. 84 మంది చట్ట సభ్యులు ఉన్న సభలో 64 మంది మద్దతు తెలిపారు. ఇది చారిత్రకమని నయిబ్ బుకేలే ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి:కుబేరులే కానీ.. ఆదాయపు పన్ను చెల్లించరట!