తెలంగాణ

telangana

ETV Bharat / business

కొవిడ్​ ఎఫెక్ట్​: ప్రపంచ వృద్ధి అంచనాలు తగ్గించిన ఈఐయూ - కొవిడ్ -19 భయాలతో ప్రపంచవృద్ధి పతనం!

కొవిడ్-19 (కరోనా) భయాల మధ్య 2020లో ప్రపంచ వృద్ధి అంచనాలను ఈఐయూ తగ్గించింది. కొవిడ్-19 ప్రపంచ ఆర్థికవ్యవస్థను అతలాకుతలం చేస్తుండడమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది. అయితే ఈ వైరస్ భారత్​కు వ్యాపించకపోతే మాత్రం... ఇండియా వృద్ధి పథంలో దూసుకుపోతుందని పేర్కొంది.

EIU lowers global growth forecast for 2020 amid corona virus scare
కొవిడ్​-19: 2020లో ప్రపంచ వృద్ధి అంచనాలు తగ్గించిన ఈఐయూ

By

Published : Feb 13, 2020, 9:38 AM IST

Updated : Mar 1, 2020, 4:29 AM IST

ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్​ (ఈఐయూ) 2020లో ప్రపంచ వృద్ధి అంచనాలను 2.3 శాతం నుంచి 2.2 శాతానికి తగ్గించింది. కొవిడ్-19 (కరోనా) ప్రపంచ ఆర్థికవ్యవస్థను అతలాకుతలం చేస్తుండడమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది.

మహమ్మారి..

చైనా సెంట్రల్ హుబీ రాష్ట్రంలోని వుహాన్​లో వెలుగుచూసిన కొవిడ్-19 నేడు పలుదేశాలకు విస్తరించి బీభత్సం సృష్టిస్తోంది. అయితే ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి చైనా పలు నిర్బంధ చర్యలు తీసుకుంటోందని ఈఐయూ పేర్కొంది.

కొవిడ్​-19 వల్లనే...

వాణిజ్య ఉద్రిక్తతలు, అమెరికా, చైనా, భారత్​ల్లో వాస్తవ జీడీపీ వృద్ధి గణనీయంగా క్షీణించడం, అనేక ఈయూ దేశాల్లో రాజకీయ అనిశ్చితి వల్ల 2019లో ప్రపంచవృద్ధి మందగించింది. కానీ ఇప్పుడు (2020లో) కొవిడ్-19 వల్ల ప్రపంచ వృద్ధికి ముప్పు ఏర్పడింది.

డ్రాగన్ విలవిల

ఈ నేపథ్యంలోనే చైనా వృద్ధి అంచనాలను ఈఐయూ తగ్గించింది. మార్చి చివరి నాటికి కొవిడ్​-19ను అదుపుచేయవచ్చని, ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి నియంత్రణలోకి రావచ్చని ఈఐయూ అంచనా వేసింది. దీనిని అనుసరించి 2020లో చైనా వాస్తవ జీడీపీ అంచనాలను 5.9 శాతం నుంచి 5.4 శాతానికి తగ్గించినట్లు ఈఐయూ స్పష్టం చేసింది.

"ఫిబ్రవరి 1నాటికి చైనాలో కొవిడ్-19 వైరస్ మరణాల రేటు 2.2 శాతం వద్ద స్థిరంగా ఉంది. అయినప్పటికీ చైనీస్​ నూతన సంవత్సర వేడుకల సమయంలో వైరస్​ మరింత వ్యాప్తిచెందే ప్రమాదముందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి."- ఈఐయూ

భారత్​ బాగానే ఉండొచ్చు!

కొవిడ్​-19 ఇండియాకు వ్యాపించకపోతే... భారత వృద్ధి సానుకూలంగా ఉంటుందని ఈఐయూ స్పష్టం చేసింది. తక్కువ వడ్డీ రేటుతో ప్రభుత్వం కల్పించే ఉద్దీపనల వల్ల డిమాండ్​, పెట్టుబడులు పెరిగే అవకాశముందని ఈఐయూ పేర్కొంది. అందువల్ల 2019కి అంచనా వేసిన 4.9 శాతం కంటే 2020లో భారత వాస్తవ జీడీపీ వృద్ధి 6.1 శాతానికి పెరిగే అవకాశముందని పేర్కొంది.

ప్రమాదమే

కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు సరిపడా వనరులు, నిర్బంధ విధానాలు లేని దేశాలకు.. వైరస్ వ్యాపించే ప్రమాదముందని ఈఐయూ హెచ్చరించింది. అలాగే ఈ వైరస్ భయాల మూలంగా జనవరి మొదటి పక్షం నాటికి ముడిచమురు ధరలు బ్యారెల్​కు 10 డాలర్ల మేర తగ్గాయని నివేదిక తెలిపింది. దీనిని అనుసరించి, 2020లో సగటు చమురు ధరల బ్యారెల్​కు 63 డాలర్లుగా ఉండొచ్చని ఈఐయూఅంచనానువేసింది. పరిస్థితి మరీ క్షీణిస్తే బ్యారెల్​ ధర మరో 3 నుంచి 5 డాలర్లు వరకు తగ్గే అవకాశముందని ఈఐయూ తెలిపింది.

ఇదీ చూడండి:వాట్సాప్​ రికార్డు: ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల యూజర్లు

Last Updated : Mar 1, 2020, 4:29 AM IST

ABOUT THE AUTHOR

...view details