తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్క్​ను వెనక్కి నెట్టి మూడో స్థానానికి మస్క్ - టెస్లా సీఈఓ సంపద

ప్రముఖ విద్యుత్​ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకారు. టెస్లా షేర్లు అమెరికా మార్కెట్లలో సోమవారం 12 శాతం పెరగటం వల్ల ఫేస్​బుక్​ సీఈఓ మార్క్​ను వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని దక్కించుకున్నారు మస్క్.

ELON MUSK WEALTH
ఎలాన్​ మస్క్ మొత్తం సంపద

By

Published : Sep 1, 2020, 1:26 PM IST

టెస్లా కార్లలానే.. ఆ సంస్థ సీఈఓ ఎలాన్​ మస్క్ సంపద కూడా దూసుకుపోతోంది. అమెరికా స్టాక్​ మార్కెట్లలో సోమవారం టెస్లా షేర్లు 12 శాతానికిపైగా పుంజుకోవడం వల్ల మస్క్ సంపద 115.4 బిలియన్ డాలర్లు దాటినట్లు బ్లూమ్​బర్గ్ నివేదిక తెలిపింది. ఇందులో కేవలం ఈ ఏడాదే 87.8 బిలియన్ డాలర్ల సంపదను మస్క్ ఆర్జించడం గమనార్హం. టెస్లా షేర్లు ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు 500 శాతం పెరిగాయి.

ఈ స్థాయిలో సంపద వృద్ధితో ఫేస్​బుక్ సీఈఓ మార్క్ జుకర్​బర్గ్​ను వెనక్కు నెట్టి ప్రపంచంలోనే మూడో అత్యంత సంపన్నుడిగా మారారు ఎలాన్​ మస్క్. బ్లూమ్​బర్ల్ ప్రకారం మార్క్ జుకర్​బర్గ్​ సంపద ప్రస్తుతం 110.8 డాలర్లుగా ఉంది. మస్క్​ కన్నా ముందు అమెజాన్ సీఈఓ జెఫ్​ బెజోస్​ (200 బిలియన్​ డాలర్లకు పైమాటే) అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో, మైక్రోసాఫ్ట్​ వ్యవస్థాపకుడు బిల్​గేట్స్ రెండో స్థానంలో ఉన్నారు.

అత్యంత సంపన్న మహిళగా మెకాంజీ

జెఫ్ బెజోస్.. మాజీ భార్య మెకాంజీ సంపద కూడా సోమవారం భారీగా పెరిగింది. బ్లూమ్​బర్గ్ ఇండెక్స్ ప్రకారం.. ఆమె మొత్తం సంపద ప్రస్తుతం 66.4 బిలియన్ డాలర్లు. సోమవారం పెరిగిన సంపదతో మెకాంజీ ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళగా అవతరించారు.

ఇదీ చూడండి:'రుణాలపై రెండేళ్ల పాటు మారటోరియం పొడిగింపు!'

ABOUT THE AUTHOR

...view details