తెలంగాణ

telangana

ETV Bharat / business

కొచ్చర్​ ఇంట్లో సోదాలు - చందాకొచ్చర్​

ఐసీఐసీఐ మాజీ ముఖ్య కార్యనిర్వహణాధికారి చందా కొచ్చర్​ నివాసంలో ఈడీ సోదాలు జరిపింది. వీడియోకాన్​ రుణ అక్రమాల కేసులో ఈ చర్యలు చేపట్టింది.

చందా కొచ్చర్

By

Published : Mar 1, 2019, 11:48 AM IST

Updated : Mar 1, 2019, 12:53 PM IST

దర్యాప్తు ముమ్మరం

ఐసీఐసీఐ-వీడియోకాన్​ రుణ అక్రమాల కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్. ఐసీఐసీఐ మాజీ ముఖ్య కార్యనిర్వహణాధికారి చందాకొచ్చర్​ ఇంట్లో సోదాలు జరిపింది. వీడియోకాన్​ ప్రతినిధి వేణుగోపాల్​ దూత్​ వినాసంలోనూ తనిఖీలు చేపట్టింది.

సుమారు ఐదు కార్యాలయాలతో పాటు, ముంబయిలోని ఇళ్లు, మరికొన్ని చోట్ల తనిఖీలు చేపట్టినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు.

వీడియోకాన్​కు అక్రమ మార్గంలో రూ.1857 కోట్ల రుణాన్ని​ మంజూరు చేశారని ఆరోపిస్తూ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్​ కొచ్చర్​,​ వేణుగోపాల్​పై ఈడీ గతంలో కేసు నమోదు చేసింది.​

Last Updated : Mar 1, 2019, 12:53 PM IST

ABOUT THE AUTHOR

...view details