ఎస్ బ్యాంక్ మనీలాండరింగ్ కేసులో ఆ బ్యాంకు సహ వ్యవస్ధాపకుడు రానా కపూర్‌కు చెందిన 2వేల 203 కోట్ల రూపాయల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. ఇందులో రానాకు చెందిన పలు విదేశీ ఆస్తులూ ఉన్నాయి. ఇదే కేసులో డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్ కపిల్ వాధవాన్, ఆయన సోదరుడు ధీరజ్ వాధవాన్‌కు చెందిన ఆస్తులనూ ఈడీ జప్తు చేసింది.
రానాకు షాక్- రూ.2 వేల కోట్ల ఆస్తులు జప్తు - ఎస్ బ్యాంక్ మనీలాండరింగ్ కేసు
మనీలాండరింగ్ కేసులో ఎస్ బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు రానాకపూర్‌కు చెందిన రూ. 2 వేల కోట్లకు పైగా ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ కేసులో డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్, అతని సోదరుడు ఆస్తులను కూడా అటాచ్ చేసింది.
![రానాకు షాక్- రూ.2 వేల కోట్ల ఆస్తులు జప్తు ED attaches over Rs 2,200 crore assets of Rana Kapoor, others in Yes Bank PMLA case](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7958128-thumbnail-3x2-asp.jpg)
ఎస్ బ్యాంక్ సహా వ్యవస్థపకుని రూ.2 వేల కోట్ల ఆస్తులు జప్తు
రానా కపూర్, ఆయన కుటుంబ సభ్యులు ముడుపులు స్వీకరించి పలువురికి రుణాలు మంజూరు చేయడం ద్వారా 4,300 కోట్ల రూపాయల మనీలాండరింగ్ నేరాలకు పాల్పడ్డట్లు ఈడీ కేసు నమోదు చేసింది. రానా మంజూరు చేసిన రుణాలు నిరర్ధక ఆస్తులుగా మారినట్లు గుర్తించింది. ఈ కేసులో ఈడీ.. రానాను ఈ ఏడాది మార్చిలో అరెస్టు చేయగా ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
ఇదీ చూడండి:ఇన్‌స్టా సహా ఆ 89 యాప్‌లపై సైన్యం నిషేధం