తెలంగాణ

telangana

ETV Bharat / business

చందా కొచ్చర్‌ భర్తను అరెస్ట్‌ చేసిన ఈడీ - దీపక్‌ కొచ్చర్‌ అరెస్ట్ న్యూస్​

ఐసీఐసీఐ-వీడియోకాన్‌ రుణాల కుంభకోణం కేసులో చందా కొచ్చర్‌ భర్త, వ్యాపారవేత్త దీపక్‌ కొచ్చర్‌ అరెస్ట్‌ అయ్యారు. వీడియో కాన్‌ గ్రూప్‌నకు రుణాల మంజూరు చేయడంలో అవకతవకలు, అవినీతికి పాల్పడ్డినట్లు ఆధారాలు లభ్యమవ్వడం వల్ల దీపక్​ను అదుపులోకి తీసుకుంది ఈడీ.

ED arrests former ICICI Bank CEO Chanda Kochhar's husband on money laundering charges
చందా కొచ్చర్‌ భర్తను అరెస్ట్‌ చేసిన ఈడీ

By

Published : Sep 7, 2020, 10:36 PM IST

ఐసీఐసీఐ-వీడియోకాన్‌ రుణాల కుంభకోణం కేసులో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్‌ భర్త, వ్యాపారవేత్త అయిన దీపక్‌ కొచ్చర్‌ అరెస్ట్‌ అయ్యారు. రుణాల మంజూరులో అవకతవకలకు పాల్పడ్డారంటూ నమోదైన మనీలాండరింగ్‌ కేసులో ఈ మధ్యాహ్నం నుంచి విచారించిన అధికారులకు ఆధారాలు లభ్యమవ్వడం వల్ల ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

వీడియో కాన్‌ గ్రూప్‌నకు రూ.1875 కోట్ల మేర రుణాల మంజూరు చేయడంలో అవకతవకలు, అవినీతికి పాల్పడ్డారంటూ చందా కొచ్చర్‌ దంపతులతో పాటు వీడియోకాన్‌ గ్రూప్‌నకు చెందిన వేణుగోపాల్‌ దూత్‌పైనా మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద గతేడాది జనవరిలో ఈడీ క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఐసీఐసీఐ బ్యాంకు చందా కొచ్చర్‌ను సీఈవో పదవి నుంచి కూడా తప్పించింది. ఈ కేసులో పలుమార్లు విచారించిన ఈడీ.. తాజాగా దీపక్‌ కొచ్చర్‌ను అరెస్టు చేసింది. అలాగే, చందా కొచ్చర్‌ హయాంలో గుజరాత్‌లోని స్టెర్లింగ్‌ బయోటెక్‌ ఫార్మా కంపెనీ, భూషణ్‌ స్టీల్‌ గ్రూప్‌కు ఐసీఐసీఐ నుంచి రుణాలు మంజూరు చేయడంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపైనా ఈడీ దర్యాప్తు చేస్తోంది.

ఇదీ చూడండి:'జీడీపీ పతనం ఆందోళనకరం- అప్రమత్తత అత్యవసరం'

ABOUT THE AUTHOR

...view details