భారత్ నుంచి విదేశాలకు వెళ్లే విమాన ధరలు జులైతో పోలిస్తే ఆగస్టు నాటికి గణనీయంగా పెరిగాయని వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. దిల్లీ-లండన్ విమానాల్లో ఎకానమీ క్లాస్ టికెట్ ధర ఆగస్టులో రూ.1.03 లక్షల నుంచి రూ.1.47 లక్షల వరకు ఉన్నట్లు స్పష్టం చేసింది.
" భారత్-యూకే మధ్య ఎకానమీ క్లాస్ టికెట్ ధరలు రూ.4 లక్షలకు చేరుకున్నాయని మీడియాలో వార్తలు వచ్చాయి. వాటికి సరైన ఆధారాలు లేవు. సంజీవ్ గుప్తా చేసిన వ్యాఖ్యలను డీజీసీఏ నిశితంగా పరిశీలించింది. 2021, ఆగస్టులో దిల్లీ-లండన్ మధ్య నడిచే భారత విమానాల్లో ఎకానమీ క్లాస్ టికెట్ ధర రూ.1.03-1.21 లక్షలు, బ్రిటన్ విమానాల్లో రూ.1.28-1.47 లక్షలుగా ఉన్నాయి. "