ఈ ఏడాది దేశంలో పసిడి డిమాండ్ సానుకూలంగా ఉండొచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) అంచనా వేసింది. కరోనా వల్ల ఏర్పడిన అనిశ్చితుల నుంచి పసిడి డిమాండ్ 2021లో రికవరీ అవ్వొచ్చని పేర్కొంది. వినియోగదారుల ధోరణిలోనూ సానుకూలతలు నమోదవ్వచ్చని పేర్కొంది.
నవంబర్‌లో దంతేరాస్ పర్వదిన ప్రాథమిక గణాంకాల ప్రకారం నగల డిమాండ్ ఇంకా సగటు కన్నా తక్కువగా ఉన్నప్పటికీ.. గత ఏడాది ఏప్రిల్-జూన్‌తో పోలిస్తే.. గణనీయమైన రికవరీ నమోదైనట్లు డబ్ల్యూజీసీ వివరించింది.