పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించినందుకు అన్నదాతలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ధన్యవాదాలు తెలిపారు. వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించారు. కొత్తగా 10 వేల ఉత్పత్తి సంస్థలను ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఆ సంస్థలు రానున్న ఐదేళ్లలో అన్నదాతలకు ఎంతో ఉపయోగపడతాయని నిర్మల ధీమా వ్యక్తం చేశారు.
'రైతులకూ సరళమైన వ్యాపారం, సులభతర జీవనం' - నిర్మలా సీతారమన్
అన్నదాతకు అండగా నిలుస్తామని ఆర్థికమంత్రి హామీ ఇచ్చారు. వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెంచుతున్నట్టు ప్రకటించారు. అన్నదాతల ఆదాయం రెట్టింపు చేయడానికి కృషి చేస్తున్నట్టు వెల్లడించారు.
'రైతులకూ సరళమైన వ్యాపారం, సులభతర జీవనం'
'సరళమైర వ్యాపారం, సులభతర జీవనం' రైతులకూ వర్తించాలన్నారు. 'సున్నా బడ్జెట్' వ్యవసాయం కోసం మూలాల ఆధారంగా సరికొత్త పద్ధతులతో అన్నదాతల ఆదాయం రెట్టింపు చేయనున్నట్టు వెల్లడించారు.
ఇదీ చూడండి:- 'ఆర్థిక వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు అవసరం'