దేశీయ స్టాక్ మార్కెట్లకు ఈ వారం.. కార్పొరేట్ కంపెనీల రెండో త్రైమాసిక ఫలితాలు, కరోనా సంబంధిత వార్తలు, అంతర్జాతీయ పరిణామాలు దిశా నిర్దేశం చేయనున్నాయి. పలు ప్రతికూల పరిణామాల వల్ల ఈ వారం మదుపరులు భారీగా లాభాల స్వీకరణకు దిగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతానికి దేశీయంగా చెప్పుకోదగ్గ అంశాలు లేదనందున.. అంతర్జాతీయ పరిణామాలు, కరోనా వైరస్ అప్డేట్లపైనే మదుపరులు దృష్టి సారించొచ్చని రెలిగేర్ బ్రోకింగ్ ఉపాధ్యక్షుడు అజిత్ మిశ్రా అంటున్నారు.
ఫలితాలు ప్రకటించనున్న ప్రముఖ కంపెనీలు
ఈ వారం 2020-21 క్యూ2 ఫలితాలు విడుదల చేసే ప్రముఖ కంపెనీలలో.. బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫినాన్స్, హెచ్యూఎల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐడీబీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ ప్రధానంగా ఉన్నాయి. వీటి ఫలితాలపై అంచనాలకు తగ్గట్లు మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అంటున్నారు.
వీటితో పాటు రూపాయి కదలికలు, ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులూ మార్కెట్లను ప్రభావితం చేసే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.
ఇదీ చూడండి:పేటీఎం షాక్: వ్యాలెట్లోకి నగదు బదిలీపై 2% ఛార్జీ!