స్వల్ప, మధ్యస్థాయి వర్ణ అంధత్వము ఉన్నవారికి కూడా డ్రైవింగ్ లైసెన్స్లు మంజూరు చేయాలని కేంద్ర రహదారి, రవాణాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు -1989లోని ఫారం-1, ఫారం-1ఏకి సవరణలు చేస్తూ అధికారిక ప్రకటన జారీ చేసింది. ఆంక్షలను కేవలం తీవ్ర వర్ణ అంధత్వం ఉన్నవారికి మాత్రమే పరిమితం చేసింది.
పాక్షిక వర్ణ అంధత్వమున్నా డ్రైవింగ్ లైసెన్స్
కేంద్ర రహదారి, రవాణాశాఖ.. పాక్షిక వర్ణ అంధత్వమున్న వారికి డ్రైవింగ్ లైసెన్స్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. అయితే తీవ్ర వర్ణ అంధత్వం ఉన్నవారికి మాత్రం లైసెన్స్లు జారీ చేయడం జరగదని స్పష్టం చేసింది.
పాక్షిక వర్ణ అంధత్వమున్నా డ్రైవింగ్ లైసెన్స్