కరోనా చికిత్సలో సత్ఫలితాలనిస్తున్న 2 డీజీ(2DG drug) కొవిడ్ ఔషధం ధరను నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఒక సాచెట్ ధర.. 990 రూపాయలకు డాక్టర్ రెడ్డీస్ అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ ఆసుపత్రులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాయితీ ఉంటుందని పేర్కొన్నాయి.
2 DG drug: 2-డీజీ డ్రగ్ ధర ఎంతంటే!
డీఆర్డీఓ అభివృద్ధి చేసిన 2డీజీ(2DG drug) కరోనా ఔషధం ధరను రూ.990గా నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ ఆసుపత్రులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాయితీ ఉంటుందని పేర్కొన్నాయి.
2-డీజీ డ్రగ్ ధరను నిర్ణయించిన కేంద్రం!
పొడిరూపంలో ఉండే 2డీజీ ఔషధాన్ని(2DG drug) హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌తో కలిసి డీఆర్డీఓ (DRDO ) ఆధ్వర్యంలోని ఇన్‌మాస్ అభివృద్ధి చేసింది. ఆక్సిజన్ అవసరమైన కొవిడ్ బాధితులు త్వరగా కోలుకునేలా ఈ ఔషధం పనిచేస్తున్నట్లు డీఆర్డీఓ ప్రకటించింది. నీటిలో కలుపుకుని తాగేలా పౌడర్ రూపంలో ఉన్న ఈ ఔషధానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ డీజీసీఐ ఇటీవలె అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చింది.