హైదరాబాద్‌కు చెందిన ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్.. కెనడాలో మరో ఔషధాన్ని విడుదల చేసింది. క్యాన్సర్ ఔషధమైన రెవిల్మిడ్ (Revlimid) (లెనాలిడొమైడ్)కు జనరిక్ వేరియంట్‌గా ఈ కొత్త క్యాప్సుల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఔషధం పేరు రెడ్డీ-లెనాలిడొమైడ్ (Reddy-Lenalidomide)గా పేర్కొంది.
మల్టిపుల్ మైలోమా, మైలోడిస్ప్రాస్టిక్సిండ్రోమ్ (Multiple Myeloma and Myelodysplastic Syndrome)తో బాధపడే వారికి అందుబాటు ధరలో.. ఈ ఔషధాన్ని అందించనున్నట్లు తెలిపింది డాక్టర్ రెడ్డీస్. ఈ క్యాప్సుల్‌కు కెనడా ఔషధ నియంత్రణ సంస్థ 'హెల్త్ కెనడా' నుంచి పూర్తి అనుమతులు లభించినట్లు వివరించింది.