తెలంగాణ

telangana

ETV Bharat / business

డాక్టర్​ రెడ్డీస్​ నుంచి కరోనాకు కొత్త ఔషధాలు! - స్పుత్నిక్​-వి డాక్టర్ రెడ్డీస్​

కొవిడ్​ రోగుల కోసం కొత్త చికిత్సా విధానాలను తాము అభివృద్ధి చేస్తున్నామని డాక్టర్​ రెడ్డీస్​ తెలిపింది. రానున్న నెలల్లో వీటిని అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పింది. అదే సమయంలో.. ప్రస్తుతం వినియోగిస్తున్న ఔషధాల ఉత్పత్తిని కూడా కొనసాగిస్తామని పేర్కొంది.

Dr Reddy's
డాక్టర్​ రెడ్డీస్​

By

Published : May 23, 2021, 1:01 PM IST

కరోనా రోగుల కోసం కొత్త చికిత్సా విధానాలను అభివృద్ధి చేస్తున్నామని హైదరాబాద్​కు చెందిన ప్రముఖ ఔషధ ఉత్పిత్తి సంస్థ డాక్టర్​ రెడ్డీస్​ ప్రకటించింది. రానున్న నెలల్లో వీటిని అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపింది. అదే సమయంలో.. ప్రస్తుతం వినియోగిస్తున్న ఔషధాల ఉత్పత్తిని నిరంతరాయంగా కొనసాగిస్తామని స్పష్టం చేసింది.

"అత్యంత వేగంగా, ఆచరణ సాధ్యమైన పద్ధతుల్లో కొవిడ్​ రోగులకు చికిత్స అందించేందుకు మేం కట్టుబడి ఉన్నాం. వివిధ సంస్థలతో మేం జట్టుకట్టిన సందర్భాల్లో ఇది నిరూపితమైంది. రెమ్​డెసివిర్​ సహా ఇతర ఔషధాల సరఫరాను కొన్ని వారాలుగా మేం భారీగా పెంచాం. దాంతోపాటుగా మేం నూతన చికిత్సా విధానాలను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. మరికొన్ని నెలల్లో వాటిని మేం మార్కెట్లో విడుదల చేస్తాం. అదే సమయంలో.. ప్రస్తుతం వినియోగిస్తున్న ఔషధాలను డిమాండ్​కు తగ్గట్టుగా ఉత్పత్తి చేస్తాం."

- జీవీ ప్రసాద్, డాక్టర్​ రెడ్డీస్​ కో ఛైర్మన్​, మేనేజింగ్​ డైరెక్టర్​

రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్​-వి టీకాను భారత్​లో డాక్టర్​ రెడ్డీస్​ పంపిణీ చేస్తోంది. డీఆర్​డీఓతోనూ ఔషధాల ఉత్పత్తిలో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

125 మిలియన్ల రోగుల కోసం 250 మిలియన్ల స్పుత్నిక్-వి టీకా డోసులను తాము పంపిణీ చేస్తామని డాక్టర్​ రెడ్డీస్​ సీఈఓ ఎరెజ్​ ఇజ్రాయెలీ తెలిపారు. ఈ టీకా డోసుల్లో ముందు కొంత భాగం... రష్యా నుంచి దిగుమతి అవుతుందని చెప్పారు. మరోవైపు.. దేశీయంగానూ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసేందుకు 6 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం తాము ఈ వ్యాక్సిన్​ సరఫరాపై దృష్టి సారించామన్నారు. రానున్న రోజుల్లో సింగిల్​ డోసు టీకా స్పుత్నిక్​-లైట్​ను భారత్​లో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తామని తెలిపారు.

డాక్టర్​ రెడ్డీస్​తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా తొలి విడతలో.. రష్యా నుంచి మే 1న భారత్​కు స్పుత్నిక్​-వి టీకా డోసులు దిగుమతి అయ్యాయి. ఈ టీకా అత్యవసర వినియోగానికి డ్రగ్​ కంట్రోలర్​ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) ఇటీవల ఆమోదం తెలిపింది.

ఇదీ చూడండి:తెలంగాణకు 'మేఘా' ఆక్సిజన్‌ క్రయోజనిక్‌ ట్యాంకులు

ఇదీ చూడండి:అమెరికాకు నాట్కో ఫార్మా కేన్సర్‌ ఔషధం

ABOUT THE AUTHOR

...view details