తెలంగాణ

telangana

ETV Bharat / business

ఒడుదొడుకుల ట్రేడింగ్​లో చివరకు మిశ్రమ ముగింపు

share markets today
నేటి స్టాక్ మార్కెట్లు

By

Published : Sep 3, 2020, 9:26 AM IST

Updated : Sep 3, 2020, 5:21 PM IST

15:47 September 03

రాణించిన ఐటీ, ఆటో షేర్లు

స్టాక్ మార్కెట్లు గురువారం మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ 95 పాయింట్లు తగ్గి 38,991 వద్దకు చేరింది. నిఫ్టీ స్వల్పంగా 7 పాయింట్లు తగ్గి 11,527 వద్ద ఫ్లాట్​గా ముగిసింది.

ఐటీ షేర్ల సానుకూలతలో ఆరంభంలో కాస్త సానుకూలంగా స్పందించిన సూచీలు మిడ్ సెషన్​ తర్వాత ఒడుదొడుకుల్లోకి జారుకున్నాయి. మొత్తం మీద గురువారం సెషన్​లో బ్యాంకింగ్ షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఐటీ, ఆటో షేర్లు రాణించాయి.

  • టైటాన్, టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా, మారుతీ, ఏషియన్ పెయింట్స్, సన్​ఫార్మా షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్​టెల్, పవర్​గ్రిడ్, కోటక్ బ్యాంక్, ఇండస్​ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.

12:31 September 03

నష్టాల్లోనూ ఐటీ సానుకూలం..

మిడ్ సెషన్​ తర్వాత స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 110 పాయింట్లకుపైగా కోల్పోయి 38,971 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 15 పాయింట్లకు పైగా స్వల్ప నష్టంతో 11,519 వద్ద కొనసాగుతోంది.

బ్యాంకింగ్, టెలికాం షేర్లలో లాభాల స్వీకరణ నష్టాలకు కారణంగా తెలుస్తోంది. ఐటీ షేర్లు మాత్రం సానుకూలంగా స్పందిస్తున్నాయి.

  • టైటాన్, మారుతీ, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్​, హెచ్​సీఎల్​టెక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్​టెల్, పవర్​గ్రిడ్, ఇండస్​ఇండ్ బ్యాంక్, ఎన్​టీపీసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

08:59 September 03

సానుకూల ప్రారంభం

స్టాక్ మార్కెట్లు గురువారం సానుకూలంగా ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 130 పాయింట్లకుపైగా బలపడి 39,220 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 30 పాయింట్లకుపైగా లాభంతో 11,566 వద్ద కొనసాగుతోంది. 

అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలు, ఆటో షేర్లు దూసుకెళ్తుండటం లాభాలకు కారణంగా తెలుస్తోంది.

బజాజ్ ఆటో, మారుతీ, ఐటీసీ, ఎల్​&టీ, టైటాన్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.

ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, ఇండస్​ఇండ్ బ్యాంక్, హెచ్​సీఎల్​ టెక్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Last Updated : Sep 3, 2020, 5:21 PM IST

ABOUT THE AUTHOR

...view details