స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 185 పాయింట్లు పెరిగి 39,086 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 65 పాయింట్ల లాభంతో 11,535 వద్దకు చేరింది.
అమ్మకాల ఒత్తిడితో ఒకానొక దశలో భారీ నష్టాల్లోకి జారుకున్న సూచీలు.. హెవీ వెయిట్, ఐటీ షేర్ల దన్నుతో చివరకు లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలూ మదుపరుల సెంటిమెంట్‌ను బలపరిచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. భారత్-చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలున్నా.. మార్కెట్లు సానుకూలంగా ముగియటం గమనార్హం.
ఇంట్రాడే సాగిందిలా
సెన్సెక్స్ 39,141 పాయింట్ల అత్యధిక స్థాయి, 38,736 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 11,549 పాయింట్ల గరిష్ఠ స్థాయి;11,430 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఎం&ఎం,పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్, హెచ్‌సీఎల్‌టెక్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.