సామాన్యుడిపై బండ భారం- మళ్లీ పెరిగిన వంటగ్యాస్ ధర
09:15 October 06
సామాన్యుడిపై బండ భారం- మళ్లీ పెరిగిన వంటగ్యాస్ ధర
గ్యాస్ ధరను మార్కెటింగ్ సంస్థలు మరోసారి పెంచాయి. 14.2కేజీల సాధారణ వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.15 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో సిలిండర్ ధర రూ.900కు చేరింది. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.
కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర ఇటీవలే రూ.43.50 పెరిగింది. ఈ ధరలు శుక్రవారం నుంచే(అక్టోబర్ 1) అమల్లోకి వచ్చాయి. ఫలితంగా 19కేజీల వాణిజ్య సిలిండర్ ధర దిల్లీలో రూ.1,736కి చేరింది. సెప్టెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు కమర్షియల్ సిలిండర్ ధర రూ.75 పెరగడం గమనార్హం.
ఓ వైపు పెట్రోల్, డీజిల్ ధరలు, మరోవైపు గ్యాస్ ధరలు పెరుగుతుండటం వల్ల సామాన్యులు అల్లాడిపోతున్నారు.