తెలంగాణ

telangana

ETV Bharat / business

ప్రేమికుల రోజు కానుక: రూ.999కే ఇండిగో ఫ్లైట్​ టికెట్ - IndiGO Valentine's Day gift: Rs.999 flight ticket

ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఇండిగో ఎయిర్​లైన్స్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వాలెంటైన్​ సేల్ పేరుతో నాలుగు రోజులపాటు రూ.999లకే విమాన టికెట్లను విక్రయిస్తున్నట్లు పేర్కొంది. దీని కోసం పది లక్షల సీట్లను కేటాయించినట్లు ఇండిగో స్పష్టం చేసింది.

IndiGO Domestic flights starting at Rs.999
రూ.999కే ఇండిగో ఫ్లైట్​ టికెట్

By

Published : Feb 12, 2020, 9:21 AM IST

Updated : Mar 1, 2020, 1:39 AM IST

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్​లైన్స్‌ ప్రేమికుల రోజును పురస్కరించుకొని అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. వాలెంటైన్ సేల్ పేరుతో నాలుగు రోజుల పాటు రూ.999 ధరకే విమాన టికెట్లను విక్రయించనుంది. అన్ని రకాల రుసుములతో కలిపి ఈ ధరకు విమాన టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇండిగో వాలెంటైన్ స్పెషల్​ ఆఫర్​ కోసం పది లక్షల సీట్లను కేటాయించింది. ఫిబ్రవరి 11న ప్రారంభమైన ఈ అమ్మకాలు ఫిబ్రవరి 14తో ముగియనున్నాయి. ఈ ఆఫర్‌ కింద టికెట్లు బుక్‌ చేసుకునేవారు మార్చి 1 నుంచి సెప్టెంబరు 30 మధ్య దేశంలో ఒక నగరం నుంచి మరో నగరానికి ఒకసారి ప్రయాణించవచ్చు.

"నాలుగు రోజుల పాటు స్పెషల్ సేల్‌ను అందుబాటులోకి తీసుకురావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. దీంతో ప్రేమికుల రోజు సంబరాలను మేము ముందుగానే ప్రారంభించాం."

- విలియం బౌల్టర్​, ఇండిగో చీఫ్‌ కమర్షియల్ ఆఫీసర్‌

కార్పొరేట్ కస్టమర్లతో పాటు విహారయాత్రలకు వెళ్లే ప్రయాణికులు ఎవరైనా తమ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని ఇండిగో తెలిపింది.

ఇదీ చూడండి:దమ్మున్న 'డీమార్ట్​' దమానీ

Last Updated : Mar 1, 2020, 1:39 AM IST

ABOUT THE AUTHOR

...view details