తెలంగాణ

telangana

ETV Bharat / business

దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్యలో స్వల్ప వృద్ధి - దేశంలోని విమాన ప్రయాణికుల సంఖ్య

దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య స్వల్ప వృద్ధికే పరిమితమైంది. 2018లో 18.6 శాతం వృద్ధి నమోదు కాగా... 2019లో 3.74 శాతానికి పడిపోయింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గణాంకాలు విడుదల చేసింది. 2019లో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 14.41 కోట్లకు చేరింది.

Domestic air passenger traffic grows by just 3.74% in 2019 compared to 18.6% in 2018: DGCA
దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్యలో స్వల్ప వృద్ధి

By

Published : Jan 20, 2020, 10:15 PM IST

Updated : Feb 17, 2020, 7:17 PM IST

దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. 2019 సంవత్సరంలో ప్రయాణికుల సంఖ్య 3.74 శాతం పెరిగి 14.41 కోట్లకు చేరుకున్నట్లు విమానయాన నియంత్రణ సంస్థ 'డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్'(డీజీసీఏ) తెలిపింది. అయితే 2018 ఏడాది వృద్ధితో పోలిస్తే ఈ సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. 2018 లో దేశీయ ప్రయాణికుల సంఖ్య 18.6 శాతం పెరగడం గమనార్హం. ఆ ఏడాది 13.89 కోట్ల మంది విమాన ప్రయాణాలు చేశారు.

ఇండి'గో'

దేశీయ ప్రయాణికుల మార్కెట్​లో ఇండిగో సంస్థ తన అగ్రస్థానాన్ని కొనసాగించింది. 2019 డిసెంబర్​లో 47.5 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. రెండోస్థానంలో ఉన్న స్పైస్​జెట్​ మార్కెట్ వాటా స్వల్పంగా పెరిగి 16.5 శాతానికి చేరింది. ఆ తర్వాతి స్థానాల్లో ఎయిర్​ఇండియా(11.9 శాతం), గోఎయిర్(10.2), ఎయిర్​ఏషియా ఇండియా(7 శాతం), విస్తారా(6.1 శాతం) ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఫిర్యాదులు

2019 డిసెంబర్​లో 957 ప్రయాణికుల సంబంధిత ఫిర్యాదులు వచ్చినట్లు డీజీసీఏ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సగటున పదివేల మంది ప్రయాణికులకు వచ్చే ఫిర్యాదుల సంఖ్య 0.74 గా ఉంది. ఎయిర్​ఇండియాకు అత్యధికంగా 2.3(పదివేల మంది ప్రయాణికులకు) ఫిర్యాదులు వస్తుండగా... ఆ తర్వాతి స్థానంలో గోఎయిర్​ సంస్థకు 0.9 ఫిర్యాదులు వస్తున్నట్లు తెలుస్తోంది.

2019 గణాంకాలపై డీజీసీఏ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. జెట్​ ఎయిర్​వేస్ ప్రతికూల ప్రభావం చూపినట్లు తెలిపారు. అయితే 2020లో మాత్రం మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్నారు.

నిధుల కొరత కారణంగా జెట్ ఎయిర్​వేస్ తన సర్వీసులను గతేడాది ఏప్రిల్​లో నిలిపివేసిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: పాక్​తో యుద్ధం ఎప్పుడు వస్తుందో చెప్పలేం: జనరల్ బిపిన్ రావత్

Last Updated : Feb 17, 2020, 7:17 PM IST

ABOUT THE AUTHOR

...view details