రండి.. నిదురపొండి అంటుంది ఓ ఇండియన్ స్టార్టప్. నిద్ర ప్రేమికుల కోసమే ఈ ఇంటర్న్ షిప్ అంటూ ఓ భారీ ఆఫర్‌ను ప్రకటించింది. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా కేవలం నిద్రపోవడమే. ఈ మేరకు బెంగళూరుకు చెందిన ఫోమ్ పరుపుల తయారీ సంస్థ ‘వేక్‌ఫిట్’ ఒక ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థులు ఈ సంస్థ రూపొందించిన పరుపులపై నిద్రించాల్సి ఉంటుంది. ఈ సంస్థ తమ వెబ్‌సైట్‌లో ఈ ఆఫర్‌ను ప్రకటించి ఆసక్తి గల అభ్యర్థులను నమోదు చేసుకోవాలని తెలిపింది.
ప్రతి రాత్రి 9 గంటల పాటు చక్కగా పరుపుపై విశ్రమించాల్సి ఉంటుంది. ఇలా 100 రోజులు చేస్తే రూ.లక్ష ఇస్తారు. ఇంటర్న్‌షిప్ పరుపులను ఉపయోగించక ముందు, ఆ తర్వాత వారిలో నిద్ర తీరుతెన్నులను 'స్లీప్ ట్రాకర్ల'తో నమోదు చేస్తారు.