దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్మన్‌గా దినేశ్ కుమార్ ఖారా నియమితులయ్యారు. ప్రస్తుత ఛైర్మన్ రజనీశ్ కుమార్ స్థానాన్ని ఆయన భర్తీ చేయనున్నారు. అక్టోబరు 7 (నేడు) నుంచి మూడేళ్ల పాటు దినేశ్ కుమార్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారని ఆర్థిక శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.
ప్రస్తుతం ఎస్‌బీఐ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న దినేశ్ కుమార్ పేరును ఎస్‌బీఐ తదుపరి ఛైర్మన్ పదవికి బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో (బీబీబీ) గత నెలలో సిఫారసు చేసిన విషయం తెలిసిందే. 2017లో సైతం ఛైర్మన్ పదవికి పోటీ పడిన వారిలో దినేశ్ కుమార్ ఉన్నారు. దినేశ్‌కుమార్ 1984లో ఎస్‌బీఐలో ప్రోబేషనరీ ఆఫీసర్‌గా చేరారు. 2016 ఆగస్టులో ఎండీగా మూడేళ్ల కాలానికి నియమితులయ్యారు. 2017లో భారతీయ మహిళా బ్యాంక్, అయిదు అనుబంధ బ్యాంకులను ఎస్‌బీఐలో విలీనం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన పనితీరు మెచ్చి, 2019లో రెండేళ్ల పొడిగింపు ఇచ్చారు.