తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆన్​లైన్ ట్రాన్సాక్షన్ ఛార్జీల రీఫండ్​- కేంద్రం కీలక నిర్ణయం - డిజిటల్​ చెల్లింపులు

Digital Transactions Reimbursement: తరచూ డిజిటల్​ చెల్లింపులు చేసే వారికి గుడ్​న్యూస్​. డిజిటల్​ చెల్లింపులపై వసూలైన ఛార్జీలను రీఫండ్​కు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ. 1300 కోట్లు కేటాయించింది.

anurag thakur
యూపీఐ

By

Published : Dec 15, 2021, 5:47 PM IST

Digital Transactions Reimbursemen: యూపీఐ, డెబిట్​ కార్డుల లావాదేవీలపై ఛార్జీలు భరిస్తున్న వారికి ఊరట కలిగించేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఛార్జీల రిఫండ్​ కోసం రూ.1300 కోట్లను కేటాయిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. డిజిటల్​ చెల్లింపులు చేసే దిశగా ప్రజలను ప్రోత్సహించేందుకే కేంద్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్​ వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి ఈ పథకం అమలులోకి రానున్నట్లు స్పష్టం చేశారు.

భీమ్​-యూపీఐ, రూపే డెబిట్​ కార్డుల ద్వారా రూ.2000లోపు ఆన్​లైన్​ చెల్లింపులు చేసినవారికి ఈ స్కీమ్​ వర్తిస్తుంది. అయితే ఇది ఈ ఏడాది ఏప్రిల్​ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు చెల్లింపులు చేసిన వారికే వర్తిస్తుంది.

ఈ స్కీమ్​ ప్రకారం సంబంధింత బ్యాంకులకు వసూలైన ఛార్జీల మొత్తాన్ని చెల్లిస్తామని కేంద్రం ప్రకటనలో పేర్కొంది.

Semiconductor Manufacturing: ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం(పీఎల్​ఐ) కింద దేశంలో సెమీకండక్టర్​-డిస్​ప్లే బోర్డ్​ ఉత్పత్తి చేసే సంస్థలకు కేంద్రం భారీగా ప్రోత్సాహకం అందించనుంది. ఇందుకోసం రానున్న 5-6 ఏళ్లకు రూ.76వేల కోట్లను కేటాయిస్తున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్​ బుధవారం కేబినెట్ సమావేశం అనంతరం వెల్లడించారు. సెమీకండక్టర్​ మిషన్​లో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం.. మైక్రోచిప్స్​ టెస్టింగ్​, ప్యాకింగ్​, డిజైన్​ తదితర విభాగాల్లో కీలక పాత్ర పోషిస్తుందన్నారు టెలికాం, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్.

ఇదీ చూడండి :అంచెలంచెలుగా ఎదిగి.. ఇప్పుడు 'షునెల్'​ సీఈఓగా భారతీయురాలు

ABOUT THE AUTHOR

...view details