తెలంగాణ

telangana

ETV Bharat / business

'భారత్​కు సొంత డిజిటల్ కరెన్సీ- క్రిప్టో ఆదాయంపై 30% పన్ను!' - డిజిటల్ రూపీ

Digital Rupee India: రూపాయికి మరింత బలాన్ని చేకూర్చేలా డిజిటల్‌ రూపీ తీసుకొస్తామన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి ఆర్​బీఐ డిజిటల్ రూపీని జారీ చేస్తుందని వెల్లడించారు.

Digital Rupee India
డిజిటల్‌ రూపీ

By

Published : Feb 1, 2022, 12:49 PM IST

Updated : Feb 1, 2022, 1:46 PM IST

Digital Rupee India: డిజిటల్ చెల్లింపులు, డిజిటల్ బ్యాంకింగ్​లో నూతన విధానంలో భాగంగా.. 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి డిజిటల్ రూపీని ప్రవేశ పెట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్​బీఐ) డిజిటల్ రూపీని జారీ చేస్తుందని బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. డిజిటల్ రూపీ విధానం ద్వారా రూపాయికి మరింత బలం చేకూరుతుందన్నారు నిర్మల.

"డిజిటల్ కరెన్సీ రాకతో డిజిటల్ బ్యాంకింగ్ అభివృద్ధి చెందింది. బ్లాక్ చెయిన్ సాంకేతికతతో ఆర్బీఐ ఇందుకోసం రూపకల్పన చేస్తోంది. డిజిటల్‌ రూపీ విడుదలతో ఆర్థిక వ్యవస్థకు కొత్త శక్తి వస్తుంది."

-- నిర్మలాసీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి

క్రిప్టో టాక్స్​..

Crypto Tax India: మరోవైపు క్రిప్టో కరెన్సీ లావాదేవీలతో వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను విధిస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. క్రిప్టో కరెన్సీల ద్వారా కానుకలు పొందినా.. వాటికి 30 శాతం క్రిప్టో పన్ను వర్తిస్తుందన్నారు. ఈ పన్ను కానుక స్వీకరించినవాళ్లు చెల్లించాలని స్పష్టం చేశారు. పరిమితికి మించి చేసిన డిజిటల్ ఆస్తుల లావాదేవీలపై ఒక్క శాతం టీడీఎస్ విధింపు ఉంటుందని వివరించారు.

75 జిల్లాల్లో డిజిటల్ బ్యాంకులు..

Digital Banking Units: డిజిటల్ బ్యాంకింగ్, డిజిటల్​ లావాదేవీలు ప్రతి ఒక్కరికీ చేరువయ్యేలా కేంద్రం నూతన విధానాలను తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. ప్రభుత్వరంగ వాణిజ్య బ్యాంకుల ద్వారా 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.

2022 ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షల పోస్టాఫీసులతో ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, ఏటీఎం సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చూడండి:Cryptocurrency in India: క్రిప్టో కరెన్సీతో దేశార్థికానికి మేలెంత?

RBI Digital Currency: డిజిటల్‌ కరెన్సీ దిశగా ఆర్‌బీఐ అడుగులు

'క్రిప్టోకరెన్సీలతో ఆర్థిక అస్థిరత'

Last Updated : Feb 1, 2022, 1:46 PM IST

ABOUT THE AUTHOR

...view details