తెలంగాణ

telangana

ETV Bharat / business

బెస్ట్​ బిఫోర్​- ఎక్స్​పైరీ డేట్.. ఈ రెండు ఒకటేనా?

ఆహార పదార్థాలు కొనేటప్పడు ఎక్స్​పైరీ డేట్, బెస్ట్​ బిఫోర్​ డేట్ విషయంలో చాలాసార్లు మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం​​. అసలు ఈ రెండు ఒకటి కాదని చాలా మందికి తెలియదు. దీనికి సంబంధించిన పూర్తి కథ మీకోసం.

Best before dates and expiry dates
బెస్ట్ బిఫోర్​ డేట్​, ఎక్స్​పైరీ డేట్​

By

Published : Jul 26, 2021, 5:34 PM IST

మనలో చాలామంది ఆహార పదార్థాలు కొనేందుకు సూపర్​ మార్కెట్​కు వెళ్తుంటాం. అవసరమున్న వాటిని తీసుకునేటప్పుడు వాటి ధర పక్కాగా గమనిస్తాం. కానీ వాటిపై ఉండే తేదీల విషయాన్ని మాత్రం కొన్నిసార్లు పట్టించుకోం. తీరా వాటిని తిన్న తర్వాత లేనిపోని అనారోగ్యం తెచ్చుకుంటాం.

అందుకే.. ప్యాకేజీలపై ఉండే మాన్యుఫ్యాక్చరీంగ్​ డేట్​(తయారీ తేదీ), ఎక్స్​పైరీ డేట్​ వంటివి తప్పక చూసి కొనుగోలు చేయాలి. అలా చూసేటప్పుడు ఎక్స్​పైరీ డేట్.. బెస్ట్ బిఫోర్ డేట్​ ఒకటే అనుకుంటాం. కానీ ఈ రెండింటికీ వేరువేరు తేదీలు ఉంటాయి. వీటి మధ్య వ్యత్యాసాన్ని మీరూ తెలుసుకోండి.

బెస్ట్​ బిఫోర్ డేట్​

ఏదైనా ఆహార పదార్థంపై బెస్ట్​ బిఫోర్​ డేట్​ ఉంటే.. ఆ తేదీ తర్వాత ఆహారం మంచిది కాదని అర్థం. కానీ దానిని తినకూడదు అని ఏంలేదు. సరిగ్గా భద్రపరిచినట్లైతే.. ఆ తేదీ దాటిన తర్వాత కూడా ఆ ఫుడ్​ను తినొచ్చు. కానీ నాణ్యత మాత్రం దెబ్బతింటుంది. అందులో ఉండే పోషక విలువలు తగ్గిపోతాయి.

ఎక్స్​పైరీ డేట్​

ఎక్స్​పైరీ డేట్​ విషయానికొస్తే.. ఆ ఆహార పదార్థం ఆ తేదీలోపు మాత్రమే తినాలి. ఒకవేళ ఆ నిర్దిష్ట తేదీ అయిపోయిన తర్వాత దాన్ని తినట్లయితే.. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందులో ఉండే పోషకాలు ఏ మాత్రం పనికిరావు. అందుకే ఏదైనా కొనేముందు.. దాని ఎక్స్​పైరీ డేట్​ పక్కగా చూడాలి.

ఎక్స్​పైరీ డేట్​ వేటి మీద ఉంటుంది?

సాధారణంగా.. ఐదు రకాల వస్తువులపై తప్పనిసరిగా ఎక్స్​పైరీ డేట్​ ఉంటుంది.

  • చిన్నపిల్లలు తీసుకునే పాలు
  • పోషకాలను అందించే పదార్థాలు​
  • ఆహార పదార్థాలు
  • లో ఎనర్జీ డైట్స్​
  • లిక్విడ్​ డైట్స్​

పడేయాల్సిందే..

ఒక్కోసారి కొన్ని ఆహార పదార్థాల నుంచి దుర్గంధం వస్తూ ఉంటుంది. బెస్ట్​ బిఫోర్​ డేట్​, ఎక్స్​పైరీ డేట్​లు చాలా దూరంగా ఉన్నప్పటికీ ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఏ మాత్రం అనుమానం వచ్చిన వాటిని తినకుండా పడేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details