తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆగని పెట్రో బాదుడు.. 19వ రోజూ ధరలు పైపైకి

దేశంలో వరుసగా 19వ రోజూ పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర గురువారం 16 పైసలు పెరిగి రికార్డు స్థాయికి చేరింది. డీజిల్​ ధర లీటర్​పై 14 పైసలు పెరిగి దిల్లీలో రూ. 80 మార్క్​ను దాటింది.

Diesel price crosses Rs 80 mark in Delhi,
ఆగని పెట్రో బాదుడు

By

Published : Jun 25, 2020, 8:59 AM IST

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలకు కళ్లెం పడే సూచనలు కనిపించడంలేదు. వరుసగా 19వ రోజు కూడా చమురు ధరలు భగ్గుమన్నాయి. గురువారం డీజిల్‌పై 14 పైసలు, పెట్రోలుపై 16 పైసలు పెంచినట్టు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో దిల్లీలో లీటరు డీజిల్‌ ధర రూ.80.02కు చేరగా.. పెట్రోల్‌ ధర రూ.79.92కు చేరింది.

దేశంలోని ఇతర రాష్ట్రాల్లో స్థానిక పన్నులు, వ్యాట్‌లలో వ్యత్యాసం వల్ల.... పెట్రోల్‌, డీజిల్‌ ధరలు దిల్లీలో కన్నా ఎక్కువగానో లేదా తక్కువగానో ఉంటున్నాయి. తాజా సవరణతో ఇతర నగరాల కన్నా దిల్లీలో డీజిల్‌ ధర అధికం కాగా పెట్రోల్‌ ధర మాత్రం తక్కువగా ఉంది.

19 రోజుల్లో రూ.10.63

గత 19 రోజుల వరుస సవరణలతో లీటర్‌ డీజిల్‌ ధర రూ.10.63.. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 8.21 పెరిగింది.

ఇదీ చూడండి: 'గగన్​యాన్​ సహా 10 ప్రయోగాలపై లాక్​డౌన్​ ఎఫెక్ట్'

ABOUT THE AUTHOR

...view details