పెట్రోల్ ధరల పెరుగుదలకు 18వ రోజు బ్రేక్ పడింది. బుధవారం పెట్రోల్ ధరలను యథాతథంగా ఉంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే డీజిల్ ధర మాత్రం దాదాపు 45 పైసలకుపైగా పెంచాయి.
17 రోజుల వరకు పెట్రోల్ ధర లీటర్‌పై రూ.8.50 పెరిగింది. డీజిల్ ధర మాత్రం 18 రోజుల్లో లీటర్‌పై రూ.10.49 పెరిగింది. దిల్లీలో లీటర్ పెట్రోల్ కన్నా.. లీటర్ డీజిల్ ఖరీదుగా మారింది.