దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న తరుణంలో అంతర్జాతీయ విమాన సేవలపై ఉన్న నిషేధాన్ని ఈ నెల 31 వరకు కొనసాగిస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటించింది. అయితే పరిమిత మార్గాల్లో మాత్రమే కొన్ని ప్రయాణికుల విమానాలు నడపనున్నట్లు తెలిపింది.
కరోనా కట్టడిలో భాగంగా మార్చి 23 నుంచి అన్ని అంతర్జాతీయ సర్వీసులను భారత్ నిలిపివేసింది. అయితే మే నెల నుంచి "వందే భారత్" మిషన్లో భాగంగా ప్రత్యేక విమానాలను నడిపారు. ఆ తర్వాత ఆంక్షలను మూడు సార్లు(జులై 31, ఆగస్టు 31, సెప్టెంబరు 30 వరకు) పొడిగిస్తూ వచ్చింది డీజీసీఏ. తాజాగా ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.