రిలయన్స్ రిటైల్‌తో ప్యూచర్ గ్రూపు కుదుర్చుకున్న రూ.24,713 కోట్ల ఒప్పందంలో సింగపూర్ ఆర్బిట్రేషన్ ప్యానెల్ తీర్పును సమర్థించింది దిల్లీ హైకోర్టు. ఒప్పందం జరగకుండా చూడాలని స్పష్టం చేసింది. అమెరికాకు చెందిన ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ పిటిషన్‌పై ఈ మేరకు తీర్పు వెలువరించింది కోర్టు.
కిశోర్ బియాని నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూపు ఈ ఒప్పందంలో ముందుకు వెళ్లొద్దని ఆదేశించారు జస్టిస్ ఆర్ జే మిధా. ఎఫ్ఆర్ఎల్ సింగపూర్ ఆర్బిట్రేటర్స్ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించినట్లు పేర్కొన్నారు.