లాక్‌డౌన్ కారణంగా దేశంలో పెట్రోల్ అమ్మకాలు 17.6 శాతం తగ్గాయి. మార్చి నెలలో డీజిల్ డిమాండ్ దాదాపు 26 శాతం పడిపోగా... ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) అమ్మకాలు కూడా 31.6 శాతం తగ్గాయి. మొత్తంగా ఏటీఎఫ్ అమ్మకాలు 4 లక్షల 63 వేల టన్నులకు పడిపోయాయి.
విమాన, వాహన రాకపోకలపై నిషేధంతో... డిమాండ్‌తో పాటు పెట్రోల్ వినియోగం కూడా తగ్గింది. గత ఏడాది మార్చిలో పోల్చితే పోల్చితే పెట్రోల్ అమ్మకాలు... 1.943 మిలియన్ టన్నులకు పడిపోయాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. డీజిల్ డిమాండ్ 25.9 శాతం తగ్గిందని వెల్లడించాయి.