పెట్రోల్, డీజల్ ధరలను తగ్గించేందుకు కేంద్రం సుముఖంగా ఉందని, సరైన సమయంలో వాటిపై ఉన్న ఎక్సైజ్ పన్నును తగ్గిస్తుందని కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల మండలి (సీబీఐసీ) ఛైర్మన్ ఎం. అజిత్ కుమార్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్, డీజల్‌పై విధించిన ఎక్సైజ్ సుంకం ద్వారా సుమారు 59శాతం వసూళ్లు కేంద్రానికి చేకూరినట్లు వెల్లడించారు. వర్చువల్ విధానంలో పాత్రికేయులతో సమావేశమైన ఆయన రాబోయే రోజుల్లో ఆదాయం మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
"ఇంధన ధరల తగ్గింపు విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. సమయం వచ్చినప్పడు దీనిపై కచ్చితంగా నిర్ణయం తీసుకుంటాము."