కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి(covaxin emergency use) అనుమతి ఇవ్వాలంటూ భారత్ బయోటెక్ చేసుకున్న విజ్ఞాపనపై.. అక్టోబర్‌లో నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ((covaxin who approval) ) వెల్లడించింది. ఈ మేరకు వచ్చే నెలలో కొవాగ్జిన్‌పై తుది నిర్ణయం వెల్లడి కానున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ(covaxin who approval status today) తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.
ప్రస్తుతం కొవాగ్జిన్ టీకా(covaxin emergency use).. డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుల కమిటీ పరిశీలనలో ఉండగా.. ఏప్రిల్ 19 నాడే ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి కోసం భారత్ బయోటెక్ పూర్తి సమాచారాన్ని అందించింది. కొవాగ్జిన్.. మూడు దశల క్లినికల్ ట్రయల్స్ సహా టీకా అనుమతికి కావాల్సిన సమగ్ర సమాచారాన్ని జూన్ నాటికే డబ్ల్యూహెచ్ఓకు సమర్పించినట్లు ఇటీవల భారత్ బయోటెక్ వెల్లడించింది. నిపుణుల బృందం అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది.