కొవిడ్-19 ఔషధాలకు వేగంగా అనుమతి ఇచ్చే ఉద్దేశంతో ఆరు ఫార్మా దిగ్గజాలను తమ తుది పత్రాలను సమర్పించాల్సిందిగా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) కోరింది. ఆ జాబితాలో మైలాన్, సిప్లా, జుబిలెంట్, హెటెరో లాబ్స్, బయోస్పియర్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ వేర్వేరు ఔషధాలను తయారు చేస్తున్నాయి.
రెమ్‌డెసివిర్ 100 ఎంజీ/వయల్ ఇంజెక్షన్‌ను మరింత సమీక్షించేందు కోసం పోస్ట్ మార్కెటింగ్ సర్వేలెన్స్(పీఎంఎస్) ప్రోటోకాల్‌ను సమర్పించాలని మైలాన్, జుబిలెంట్‌లను ఇటీవల జరిగిన సమావేశంలో డీసీజీఐలోని నిపుణుల కమిటీ(ఎస్‌ఈసీ) కోరింది. ఆ సమావేశంలో సిప్లా తన రెమ్‌డెసివిర్ 100 ఎంజీ/వయల్ ఇంజెక్షన్‌కు సంబంధించిన పీఎంఎస్ ప్రోటోకాల్‌ను సమర్పించింది.