భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ).. ఈ ఏడాది 25 కొత్త ఔషధాలకు ఆమోదం తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. అందులో మూడు కరోనా వైరస్ ఔషధాలు ఉన్నట్లు పేర్కొన్నారు.
కరోనా బాధితుల చికిత్స కోసం రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ (5 మి.లీ), రెమ్‌డెసివిర్ లైయోఫిలైస్డ్ పౌడర్ ఫర్ ఇంజెక్షన్ (100 మి.గ్రా) డ్రగ్స్‌కు డీసీజీఐ ఆమోదం తెలిపినట్లు అధికారులు తెలిపారు. ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లను సైతం.. స్పల్ప లక్షణాలు ఉన్న కరోనా రోగుల కోసం ఉపయోగించేందుకు అనుమతించినట్లు చెప్పారు. మరోవైపు దీర్ఘకాల మూత్రపిండ వ్యాధి ఉన్న రోగుల్లో సీరం ఫాస్పరస్ స్థాయిలను నియంత్రించే సుక్రోఫెర్రిక్ ఆక్సీహైడ్రాక్సైడ్ ఔషధాన్ని ఈ ఏడాది డీసీజీఐ ఆమోదించినట్లు వివరించారు.