భారత్‌లో 7-11 ఏళ్ల మధ్య పిల్లలకు అందజేసేలా టీకా సిద్ధం చేసేందుకు, ప్రయోగాలు మొదలుపెట్టేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు(Serum Institute of India) నేడు అనుమతి లభించిందని సెంటర్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నిపుణుల కమిటీ సభ్యుడు తెలిపారు. దేశంలో పాఠశాలలు పునః ప్రారంభిస్తుండటంతో ప్రభుత్వం పిల్లలకు వ్యాక్సిన్ అందించే విషయంలో చురుగ్గా ప్రయత్నాలు చేస్తోంది. మరోపక్క భారత్‌లో పెద్దలకు వ్యాక్సినేషన్(Vaccination in India) కార్యక్రమం వేగంగా జరుగుతోంది. ఇప్పటికే 87 కోట్ల డోసుల టీకాలను వేశారు.
"కమిటీలో విస్తృతంగా చర్చించిన తర్వాత 7-11 సంవత్సరాల మధ్య చిన్నారులకు ప్రొటోకాల్ ప్రకారం టీకాలను అందుబాటులోకి తెచ్చేందుకు ఆమోదం తెలిపాం" అని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ నిపుణుల కమిటీ సభ్యుడు తెలిపారు.