తెలంగాణ

telangana

ETV Bharat / business

4 నెలల్లో రూ.31 లక్షల కోట్ల సంపద వృద్ధి - స్టాక్ మార్కెట్ల లాభాలకు కారణాలు

కరోనా వల్ల గత ఏడాది చారిత్రక నష్టాలను నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు.. ఆ తర్వాత స్వల్ప కాలంలోనే కోలుకుని.. అంచనాలకు మించి దూసుకుపోతున్నాయి. మార్కెట్ల ఈ దూకుడుతో బీఎస్​ఈ నమోదిత కంపెనీల విలువ 2021-22 తొలి నాలుగు నెలల్లో రూ.31 లక్షల కోట్లు పెరిగింది. మార్కెట్ల దూకుడుకు విశ్లేషకులు చెబుతున్న కారణాలు ఇలా ఉన్నాయి.

Wealth rise in a huge level
భారీగా పెరిగిన సంపద

By

Published : Aug 1, 2021, 12:38 PM IST

స్టాక్ మార్కెట్లో మదుపరుల సంపద రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లోనే బీఎస్​ఈ మదుపరుల సంపద రూ.31 లక్షల కోట్లకుపైగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కరోనా విజృంభణ, కఠిన ఆంక్షలు.. ఇవేవి స్టాక్ మార్కెట్ల జోరును అడ్డుకోలేకపోయాయని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ స్థాయి వృద్ధితో.. జులై 30 నాటికి బీఎస్​ఈ నమోదిత కంపెనీల మార్కెట్​ క్యాపిటల్​ (ఎం-క్యాప్​) రూ.2,35,49,748.90 కోట్లకు చేరింది.

2021 ఏప్రిల్​-జులై మధ్య నాలుగు నెలల కాలంలో బీఎస్​ఈ-సెన్సెక్స్ 3,077 పాయింట్లు (6.21 శాతం) పుంజుకుంది. జులై 16న ఈ సూచీ ఏకంగా 53,290.81 పాయింట్ల వద్ద (ఇంట్రాడేలో) జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. జులై 15న తొలిసారి 53,158.85 పాయింట్ల వద్ద ముగిసింది.

2020-21లో ఇలా..

గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద.. సెన్సెక్స్ 20,040.66 పాయింట్లు (68 శాతం) బలపడింది. దీనితో బీఎస్​ఈ నమోదిత కంపెనీల విలువ రూ.90,82,057.95 కోట్ల నుంచి రూ.2,04,30,814.54 కోట్లకు పెరిగింది.

ఈ స్థాయి వృద్ధికి కారణాలు..

ఈజిప్ట్​, ఇరాన్​ వంటి దేశాల స్టాక్ మార్కెట్లు మినహా.. ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా అన్ని ప్రధాన మార్కెట్లలో బుల్ జోరు కొనసాగుతుండటం సానుకూల అంశమని అంటున్నారు నిపుణులు. అమెరికా ఫెడ్​ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రధాన కేంద్రీయ బ్యాంక్​లు వడ్డీ రేట్లను చారిత్రక కనిష్ఠానికి తగ్గించడం, రిటైల్ మదుపరులు రికార్డు స్థాయిలో పెరగటం వంటివి ఈ స్థాయిలో మార్కెట్లు దూసుకుపోయేందుకు కారణం అని చెబుతున్నారు.

కరోనా వల్ల గత ఏడాది చారిత్రక పతనాన్ని చవిచూసినా.. వ్యాక్సిన్ వార్తల వల్ల సెంటిమెంట్ బలపడిందని అందువల్లే మార్కెట్లు దూసుకుపోతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details