దిగుమతి చేసుకున్న ఫ్యాన్లు, గిన్నెలు, వంట సామగ్రిపై కస్టమ్స్ సుంకాలను పెంచుతున్నట్టు బడ్జెట్లో ప్రకటించారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.
వెన్న తీసిన పాలు(స్కిమ్మిడ్ మిల్క్), పలు మద్యపానీయాలు, సోయా ఫైబర్, సోయా ప్రొటీన్, పంచధార, పాడి ఉత్పత్తులపై ఉన్న సుంకాల మినహాయింపును ఉపసంహరించుకున్నట్టు నిర్మల వెల్లడించారు.
ఫ్యాన్లపై ఇంతకు ముందు 7.5శాతంగా ఉన్న కస్టమ్స్ సుంకాలు... తాజాగా 20శాతానికి పెరిగాయి. పింగాణీ, చైనా సిరామిక్, ఉక్కు, రాగితో చేసిన గిన్నెలు-వంటసామగ్రిపై సుంకాలను 20శాతానికి పెంచింది కేంద్రం.