తెలంగాణ

telangana

ETV Bharat / business

cryptocurrency news: రూ.4,537 కోట్ల క్రిప్టో కరెన్సీ హాంఫట్‌!

పాలినెట్‌వర్క్‌ యాప్‌లోని క్రిప్టో కరెన్సీని (cryptocurrency news) చోరులు కొల్లగొట్టారు. ఈ మొత్తం విలువ రూ.4,537 కోట్లు ఉంటుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కొల్లగొట్టిన సొమ్మును తిరిగి ఇవ్వమని కోరుతూ హ్యాకర్స్​కు ప్రతినిధులు లేఖ రాశారు.

cryptocurrency news latest, క్రిప్టో కరెన్సీ హ్యాక్
రూ.4,537 కోట్ల క్రిప్టో కరెన్సీ హాంఫట్‌!

By

Published : Aug 12, 2021, 6:13 PM IST

Updated : Aug 12, 2021, 6:25 PM IST

క్రిప్టో కరెన్సీ చరిత్రలో ఇది భారీ కుదుపు.. డీసెంట్రలైజ్డ్‌ ఫైనాన్షియల్‌ (డీఫై) సర్వీసెస్‌ అందించే పాలినెట్‌వర్క్‌ యాప్‌లో దొంగలు చొరబడ్డారు. ఈ యాప్‌ తాలూకు బ్లాక్‌చెయిన్‌ను ఛేదించి.. కనీ వినీ ఎరుగని రీతిలో 61.1 కోట్ల డాలర్ల (రూ.4,537 కోట్లు) క్రిప్టో కరెన్సీని (cryptocurrency news) చోరులు కొల్లగొట్టారు. పాలినెట్‌వర్క్‌ కంపెనీ ప్రతినిధులు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ మంగళవారం ట్వీట్‌ చేశారు. హ్యాకర్లు ఆ సొమ్మును మళ్లించిన చిరునామాలను కూడా అందులో పేర్కొన్నారు. ఈ చిరునామాల నుంచి వచ్చే టోకెన్లను బ్లాక్‌లిస్టులో పెట్టాల్సిందిగా ఇతర ఎక్స్ఛేంజీలకు విజ్ఞప్తి చేశారు. మరో ప్రయత్నంగా.. 'డియర్‌ హ్యాకర్స్‌' అంటూ కొల్లగొట్టిన సొమ్మును తిరిగి వెనక్కు బదిలీ చేయవలసిందిగా వారిని కోరుతూ లేఖ కూడా రాశారు.

అలా చేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని లేఖ చివర హెచ్చరించారు. ఎ§లినెట్‌వర్క్‌ వేదికగా వినియోగదారులు క్రిప్టో కరెన్సీ టోకెన్లు మార్పిడి చేసుకొంటూ ఉంటారు. హ్యాకింగు ఉదంతంతో వేలాది పెట్టుబడిదారులు ఆందోళనకు గురవుతున్నారు. పాలినెట్‌వర్క్‌లోని ఈథేరియం నుంచి 27.3 కోట్ల డాలర్లు, బినాన్స్‌ స్మార్ట్‌ చెయిన్‌ నుంచి 25.3 కోట్ల డాలర్లు, 8.5 కోట్ల యూఎస్‌ డాలర్‌ కాయిన్లు, 3.3 కోట్ల డాలర్ల స్టేబుల్‌ కాయిన్లను హ్యాకర్లు సొంతం చేసుకున్నారు. ఈ హ్యాకింగుపై బినాన్స్‌ క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజి సీఈవో చాంగ్‌పెంగ్‌ జావో స్పందిస్తూ.. 'పాలినెట్‌వర్క్‌ దోపిడీకి గురైన విషయం తెలిసింది. భద్రత పరంగా మేము అన్ని చర్యలు తీసుకొంటున్నాం. గ్యారంటీ లేదు.. మేము చేయగలిగినంత చేస్తాం' అని ట్వీట్‌ చేశారు.

ఇదీ చదవండి :'అప్పటికల్లా రూ.75లక్షల కోట్లకు ఎగుమతులు'

Last Updated : Aug 12, 2021, 6:25 PM IST

ABOUT THE AUTHOR

...view details