డిజిటల్ కరెన్సీ లేదా క్రిప్టో కరెన్సీ విలువ, డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. దీంతో ఎక్కువ మంది పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ కరెన్సీ లావాదేవీలన్నీ ఆన్లైన్లో జరుగుతుండటం.. పోర్జరీ చేసేందుకు వీలు లేకపోవడం ఇందుకు కారణంగా చెప్పొచ్చు. క్రిప్టో కరెన్సీ అనగానే ఎక్కువ మందికి బిట్‌కాయిన్ మాత్రమే గుర్తొస్తుంది. దీంతోపాటే.. ఇంకా చాలా రకాల డిజిటల్ కరెన్సీలు మార్కెట్లో ఉన్నాయి.
బిట్‌కాయిన్
- ఒక బిట్‌కాయిన్.. 61803.11 యూఎస్ డాలర్లకు సమానం (రూ.45.85లక్షలు)
- దీని మార్కెట్ విలువ 1.7 ట్రిలియన్ డాలర్లు.
- దీనిని 2009లో ప్రారంభించారు.
ఇథెరియమ్
- ఒక ఇథెరియమ్: 4582.73 యూఎస్ డాలర్లు (రూ.3.39లక్షలు)
- మొత్తం మార్కెట్ విలువ : 520 బిలియన్ డాలర్లు
- ప్రారంభం: 2009
బినాన్స్ కాయిన్
- ఒక బినాన్స్.. 661.93 యూఎస్ డాలర్లకు సమానం (రూ.49,109.48)
- మొత్తం మార్కెట్ విలువ 88 బిలియన్ డాలర్లు
- 2017లో ప్రారంభమైంది.
సోలానా
- ఒక సోలానా = 251.95 డాలర్లు (రూ.18,692.51)
- మొత్తం మార్కెట్ విలువ 60 బిలియన్ డాలర్లు
- 2018లో ప్రారంభించారు.
టెథర్
- ఒక టెథర్ = 1 యూఎస్ డాలర్ (రూ.74.19)
- మొత్తం మార్కెట్ విలువ 70 బిలియన్ డాలర్లు
- 2014లో ప్రారంభమైంది.
కర్డనో
- ఒక కర్డనో = 1.99 యూఎస్ డాలర్లు (రూ.147.64)
- మొత్తం మార్కెట్ విలువ 66 బిలియన్ డాలర్లు.
- ప్రారంభం : 2015