Crude oil prices: ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు పుతిన్ ఆదేశించడం అంతర్జాతీయ మార్కెట్లపై పెను ప్రభావం చూపించింది. ముడిచమురు ధర ఒక్కసారి భగ్గుమంది. దాదాపు ఏడేళ్ల తర్వాత పీపా చమురు ధర 100 డాలర్లను దాటేసింది. ఆసియా స్టాక్ మార్కెట్లు మొత్తం 2 నుంచి 3శాతం వరకు నష్టపోయాయి. ఉక్రెయిన్ సరిహద్దుల వద్ద రష్యా దళాల మోహరింపులు మొదలైన నాటి నుంచి చమురు ధరలు వేగంగా పెరుగుతూ వచ్చాయి.
Ukraine Crisis: ఉక్రెయిన్‌పై దాడితో భగ్గుమన్న చమురు ధర - పీపా చమురు ధర
Crude oil prices rised due to Russia Ukraine war: రష్యా, ఉక్రెయిన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచమార్కెట్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధ ప్రకటనతో ముడిచమురు ధర ఒక్కసారి భగ్గుమంది. ఈ క్రమంలో ఏడేళ్లలో అత్యధికంగా బ్రెంట్ క్రూడ్ బ్యారల్‌కు 100 డాలర్ల స్థాయికి చేరింది.
Crude oil prices
ఈ క్రమంలో ఏడేళ్లలో అత్యధికంగా బ్రెంట్ క్రూడ్ బ్యారల్‌కు 100 డాలర్ల స్థాయికి చేరింది. మార్కెట్ ఇన్వెస్టర్లు వేగంగా సురక్షితమైన పెట్టుబడుల వైపు మళ్లుతున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అందుకే బంగారం, డాలర్లు, జపాన్ యెన్ వంటి వాటి ధరలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. రష్యా చర్యలపై పశ్చిమ దేశాల స్పందనల ఆధారంగా చమురు ధరల్లో మార్పులు ఉండొచ్చని భావిస్తున్నారు.
Last Updated : Feb 24, 2022, 7:43 PM IST